కలం వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గడ్ లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఇన్‌ఫార్మర్ అని అనుమానిస్తూ మావోయిస్టులు ఓ మాజీ సర్పంచ్‌ను హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కవరగట్టు మాజీ సర్పంచ్ మడకం భీమ మావోయిస్టులతో కొన్నేళ్లుగా సంబంధాలు కలిగి ఉన్నారు. ఇటీవల బీజాపూర్ పరిసరాల్లో నెలకొన్న పరిస్థితులతో తమలోనే ఎవరో ఇన్‌ఫార్మర్లు ఉన్నారని మావోయిస్టులకు అనుమానం కలిగింది. సదరు ఇన్‌ఫార్మర్ తమ రహస్యాలను భద్రతా బలగాలకు, పోలీసులకు చేరవేస్తున్నారని భావించారు. మడకం భీమ ఇన్‌ఫార్మర్‌గా మారినట్లు అనుమానించి అతడిని కాల్చి చంపేశారు. పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా, అందరూ చూస్తూ ఉండగానే ఈ హత్య జరిగింది. గతంలో ఓసారి భీమపై కాల్పులు జరగగా తప్పించుకున్నాడు. కానీ, ఈసారి ప్రాణాలు కోల్పోయాడు. భీమ హత్య స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also: తెలంగాణలో అమెరికా సంస్థ సర్గాడ్ రూ.1000 కోట్ల పెట్టుబడులు
Follow Us On: Pinterest


