Mobile Popup Ad
Mobile Popup Ad

రాహుల్‌ గాంధీతో షర్మిల భేటీ.. రాజ్యసభకు ఎంపిక?

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల (YS Sharmila) పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. దిల్లీలోని 10 జనపథ్ నివాసంలో ఆయన్ను కలిసి ఏపీలో కాంగ్రెస్ బలోపేతం, పార్టీ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు. రాహుల్ గాంధీ నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నట్లు షర్మిల తన ‘ఎక్స్’ ఖాతాలో తెలిపారు. ఇదిలా ఉంటే, షర్మిలను రాజ్యసభ ఎంపీగా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో కర్ణాటకలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. మెజార్టీ ప్రకారం, ఇవి కాంగ్రెస్ పార్టీకే దక్కనుండటంతో అందులో ఒకటి షర్మిలకు కేటాయించాలని భావిస్తున్నారట. దీని గురించే రాహుల్ గాంధీతో (Rahul Gandhi) చర్చ జరిగినట్లు ఇన్ సైడ్ టాక్.

గతంలోనే షర్మిలకు హామీ..

వైఎస్.షర్మిల (YS Sharmila) ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఆమెను పెద్దల సభకు పంపిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కర్ణాటకలో త్వరలో సీఎం కాబోతున్న డీకే.శివకుమార్‌ కుటుంబంతో షర్మిలకు మంచి సాన్నిహిత్యం ఉంది. పలుమార్లు డీకేతో బెంగళూరులో భేటీ అయ్యారు. షర్మిలను రాజ్యసభ ఎంపీగా పంపించాలని డీకే.శివకుమార్ సైతం కాంగ్రెస్ అధిష్ఠానానికి సిఫార్సు చేసినట్లు దిల్లీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read Also: మ‌హానాడు మొత్తం జ‌గ‌న్ నామ స్మ‌ర‌ణే: శ్యామ‌ల‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>