కలం, నిజామాబాద్ బ్యూరో : తమ అక్రమ సంబంధానికి అడ్డొగా ఉన్నాడని, భర్తను హత్యచేసిన భార్యకు, ఆమె ప్రియుడికి నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా జడ్జి కోర్టు జడ్జి ధరావత్ దుర్గాప్రసాద్ యవజ్జీవ కారాగార శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు. హత్య తర్వాత సాక్ష్యాలను మాయం చేసినందుకు మరో మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు.
నాల్గవ అదనపు జిల్లా జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యుటర్ యం.నీరజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని ఆలూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన గుగులోత్ శంకర్, యమున భార్య భర్తలు. యమున గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రామానికి చెందిన నునావత్ నందుతో అక్రమ సంబందం కొనసాగిస్తోంది. ఈ కారణంగా శంకర్, యమునల మధ్య తరచూ కలహాలు చోటుచేసుకుంటున్నాయి. యమున, నందుతో దూరంగా ఉండాలంటూ ఇటు భర్త శంకర్ తో పాటు కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించారు.
అయినా వారి హెచ్చరికలను పెడచెవిన పెట్టిన యమున, తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నడని భావించి, శంకర్ ను ప్రియుడు నందుతో కలిసి మట్టుబెట్టాలని తలపెట్టింది. 7, సెప్టెంబర్, 2026 అర్థరాత్రి ఒంటిగంట సమయంలో భర్త శంకర్ ను ప్రియుడితో కలిసి ఇంటిపై నుండి తొసి చంపేందుకు యత్నించింది. శంకర్ తీవ్రగాయలతో ఇబ్బంది పడుతుండగా, ఇద్దరు కలిసి కర్రలు, ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు.
రోడ్డుపై ఉన్న శంకర్ శవాన్ని చూసిన గ్రామస్తులు అతని కుమారుడు రమేష్ కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న వారు తల్లి యమునను ప్రశ్నించారు. వర్షం రావడంతో డాబా పై నుండి కిందికి దిగే క్రమంలో కింద పడి గాయపడ్డాడని నమ్మించింది. అంత్యక్రియల సమయంలో మృతిని శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానం వచ్చిన మృతుని కుమారులు, బందువులు గ్రామ పెద్దల సమక్షంలో తల్లి యమునను విచారించగా తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నడని ప్రియిడితో కలిసి చంపినట్టుగా తెలిపింది.
ఈ సమాచారం అధారంగా వారు మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో శంకర్ ను నిజం ఒప్పుకోవడంతో, నిందులపై హత్య, సాక్ష్యాలను మాయం చేసినట్టుగా కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించారు. కేసును విచారించిన నాల్గవ అదనపు జిల్లా జడ్జి కోర్టు జడ్జి ధరావత్ దుర్గాప్రసాద్ నింధితులకు యవజ్జీవ కారాగార శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమాన విధించారు.
జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని జడ్జి ఆదేశించారు. హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించినందుకు మరో మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష అనుభవించాలని, రెండు శిక్షలు ఏక కాలంలో అనుభవించాలని ఆయన తీర్పునిచ్చారు.

