కలం, స్పోర్ట్స్ : బెంగళూరు తీరంలో సరికొత్త అలల పండగ మొదలైంది. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘ఎన్‌ఎమ్‌పీఏ ఇండియన్ ఓపెన్ ఆఫ్ సర్ఫింగ్ 2026’ (NMPE Indian Open of Surfing 2026) ఏడో ఎడిషన్ పోటీలు ఈరోజు నుంచే (మే 29) తన్నీరుబావి ఎకో బీచ్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జరగబోయే ఆసియా గేమ్స్‌లో సర్ఫింగ్‌ను మొదటిసారిగా చేర్చారు. దీంతో భారత జట్టులో చోటు సంపాదించడానికి మన దేశ టాప్ సర్ఫర్లకు ఇదే ఆఖరి అవకాశం కావడంతో ఈ పోటీలపై అందరి కళ్ళు పడ్డాయి. ఈ మూడు రోజుల ఈవెంట్‌లో కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి 80 మందికి పైగా అథ్లెట్లు వచ్చారు. ఇందులో మెన్స్, ఉమెన్స్ విభాగాలతో పాటు చిన్న పిల్లల కోసం అండర్-14 కేటగిరీని కూడా మొదటిసారి ప్రవేశపెట్టారు.
మంత్రా సర్ఫ్ క్లబ్, సర్ఫింగ్ స్వామి ఫౌండేషన్లు ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఈ ఈవెంట్‌కు (Indian Open of Surfing) పూర్తి మద్దతు ఇస్తోంది. ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే.. ఆసియా స్థాయిలో మెడల్ గెలిచిన రమేష్ బుడిహాల్, ఇటీవలే అండమాన్ రేసులో గెలిచిన శివరాజ్ బాబుల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. మహిళల విభాగంలో తమిళనాడు స్టార్ కమాలి పి, గోవాకు చెందిన షుగర్ శాంతి బనార్సే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Read Also: రోజూ 10 నిమిషాలు ధ్యానం చేస్తే.. ఎన్ని అద్భుత ప్రయోజనాలో తెలుసా?
Follow Us On : WhatsApp

