సీఎం జిల్లా పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : దివిటిపల్లి సమీపంలోని అమర రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్‌లో నూతనంగా నిర్మించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (సి.క్యూ.పి) ను బుధవారం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushbu Gupta) మంగళవారం పరిశ్రమ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమావేశంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లు, సభా ప్రాంగణంలో వేదిక (డయాస్) ఏర్పాటు, సీటింగ్, రాకపోకల ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులు, కంపెనీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా అధికారులు, కంపెనీ ప్రతినిధులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.జానకి, అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, ఆర్.డి.ఓ నవీన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, అమర రాజా కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>