కలం, వెబ్ డెస్క్: టీడీపీ మహానాడు (TDP Mahanadu) కార్యక్రమంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల (Syamala) విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వానికి అభివృద్దిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. అభివృద్ధి గురించి చర్చించాల్సిన మహానాడు వేదికను రాజకీయ నిందల వేదికగా మార్చేశారన్నారు. సీఎం చంద్రబాబు దగ్గరి నుంచి ఆయన మంత్రివర్గమంతా వీధి భాషకు బాగా అలవాటు పడ్డారని విమర్శించారు. ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరీ దారుణంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఒక్క నాయకుడు కూడా గత రెండేళ్లలో తమ ప్రభుత్వం ప్రజల కోసం ఇది చేసింది అని చెప్పుకోలేదన్నారు.
అసలు ప్రజల కోసం చేసిందేమీ లేదు కాబట్టే నిత్యం వైఎస్ జగన్‌పై, వైసీపీ పై విమర్శలు చేస్తూ పబ్బం గుడుపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 164 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా జగన్ పేరు లేకుండా ఒక్క ప్రసంగం కూడా చేయలేకపోతున్నారంటే జగన్ అంటే ఎంత భయం ఉందో అర్థం అవుతోందన్నారు. జగన్ సుపరిపాలనపై భయం ఉండబట్టే కూటమి నేతలు అనుక్షణం ఆయనను తల్చుకుంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీ వాళ్లు ఎదురు ప్రశ్నిస్తే కూటమి మంత్రులు, అధికారులు దిగజారిపోయి విమర్శలు చేస్తున్నారని ఆమె (Syamala) ఆరోపించారు.
Read Also: జూన్ 10న ఎన్డీయే కాన్‌క్లేవ్.. సీఎంలతో ప్రధాని మోదీ భేటీ
Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

