కలం, వెబ్‌డెస్క్: భూముల రీసర్వేపైనా సీఎం చంద్రబాబు (Chandrababu) క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఆరోపించారు. గురువారం తాడేపల్లిలో విలేకరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము చేసిన ప్రతి పనినీ తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయంతోపాటు తాము తెచ్చిన అనేక ప్రాజెక్టులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారని మండిపడ్డారు. ఇదే కోవలో ఇప్పుడు భూముల రీసర్వేపైనా క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది మేం చేసిన మహాయజ్ఞం..
భూముల రీసర్వే అనేది వైఎస్సార్సీపీ హయాంలో తాము మొదలుపెట్టామన్నామని వైఎస్ జగన్ అన్నారు. దీనికోసం సచివాలయాలు ఏర్పాటుచేసి, వేల సిబ్బందిని నియమించి ప్రక్రియ ప్రారంభించామన్నారు. రీసర్వే పూర్తి చేయడానికి సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. యూరప్‌లో వాడుతున్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 73 ప్రాంతాల్లో నిరంతర ఆపరేటింగ్‌ను ఏర్పాటుచేసి, పర్యవేక్షించామన్నారు. గ్లోబల్ నేవిగేషన్ సిస్టమ్ రిసీవర్స్ వాడామన్నారు. 2 విమానాలు, నాలుగు హెలికాప్టర్లు, 200కు పైగా హై ఎండ్ డ్రోన్స్ ఉపయోగించామన్నారు. రీసర్వేపై పూర్తి అవగాహన కోసం సిబ్బందికి 70కి పైగా ట్రైనింగ్ ఇచ్చినట్లు చెప్పారు. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలను తరలించామన్నారు.
‘శాశ్వత భూ రక్ష.. భూ హక్కు’ పేరుతో తాము చేసిన భూముల రీసర్వే చరిత్రాత్మకమన్నారు. ఈ విధానంలో ఐదు సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కొలతలు వేసినట్లు చెప్పారు. మీభూమి పోర్టల్‌ను కూడా అన్ని వివరాలతో అప్‌గ్రేడ్ చేశామన్నారు. కోట్ల సర్వే రాళ్లను పాతామన్నారు. తాము చేసింది మహాయజ్ఞమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీకి వచ్చి రీ సర్వేపై అధ్యయనం చేశాయన్నారు. ఈ సందర్భంగా భూముల రీసర్వేకు తాము చేసిన కార్యక్రమాలను వీడియోలు, క్లిప్లింగ్స్ ద్వారా ప్రదర్శించారు.
తాము ఇంత గొప్ప పనిచేస్తే.. ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదన్నారు. తీరా అబద్ధాలతో అధికారంలోకి వచ్చాక, భూముల రీసర్వేను తన ఖాతాలో వేసుకుంటున్నారని, చంద్రబాబుకు సిగ్గుండాలని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. సర్వే అంటే ఏంటో కూడా చంద్రబాబుకు తెలియదని జగన్ (YS Jagan) ఎద్దేవా చేశారు.
Read Also: ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి
Follow Us On: Sharechat


