కలం, వెబ్ డెస్క్ : మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad ) అసాధారణ ప్రతిభ గలవాడు. 20 ఏళ్లకు పైగా ఆయన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోలకు మ్యూజిక్ ఇచ్చాడు. హిందీలోనూ దేవి పాటలు పాపులర్ అయ్యాయి. అలాంటి దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు ఎల్లమ్మ సినిమా (Yellamma) తో హీరోగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే.. అతనికి ఈ సినిమా ఒక ఛాలెంజ్ అని చెప్పచ్చు.
దేవి శ్రీ ప్రసాద్ వర్సటైల్ పర్సన్. కంపోజింగ్ తో పాటు పాటలు రాస్తాడు, పాడతాడు, డ్యాన్సులు చేస్తాడు. ఈ క్రమంలో నటుడిగానూ ఆయనలో ప్రతిభ ఉందనే దర్శకుడు వేణు యెల్దండి నమ్ముతున్నాడు. అందుకే నితిన్, నాని లాంటి హీరోలు చేయాల్సిన టైటిల్ రోల్ ను దేవితో చేయిస్తున్నాడు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గొప్పదనం చూపించేలా రూపొందుతున్న ఎల్లమ్మ (Yellamma) లో డప్పు కళాకారుడు ఎల్లమ్మ పాత్రలో దేవి శ్రీ ప్రసాద్ నటిస్తున్నారు.
ఈ పాత్ర చాలా ఎమోషనల్ గా డెప్త్ గా ఉంటుందట. ఆ పాత్రలోని భావోద్వేగాలను సరిగ్గా పలికిస్తే నటుడిగా దేవి సక్సెస్ అయినట్లే. మరోవైపు ఈ మూవీకి సంగీత బాధ్యతలు కూడా దేవినే తీసుకున్నారు. ప్రస్తుతం ఎల్లమ్మ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ ఇయర్ లో ఈ మూవీని భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. దేవి ఈ ఛాలెంజింగ్ రోల్ లో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.
Read Also: స్పిరిట్ నుంచి క్రేజీ అప్డేట్..!
Follow Us On : WhatsApp


