epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

ప్రపంచంలోనే తొలి ‘స్విస్ మాల్’ హైదరాబాద్‌లో..

కలం, వెబ్​ డెస్క్​ : ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సందర్భంగా దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్విట్జర్లాండ్‌లోని వాడ్ (Vaud) రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారత్ – స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య సహకార పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్–2047 విజన్‌ను స్విస్ ప్రతినిధులకు వివరించారు.  ‘స్విస్ మాల్’ (Swiss Mall) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి ప్రతిపాదించగా, స్విస్ బృందం వెంటనే సానుకూలంగా స్పందించింది.

Swiss Mall
Swiss Mall to Hyderabad

ఇది అమలయితే ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్ మాల్’ రానున్నది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఫుట్‌బాల్ ఆటగాళ్లే కావడంతో, క్రీడల రంగంలో భాగస్వామ్యంపై కూడా విస్తృతంగా చర్చించారు. క్రీడా శిక్షణ, మౌలిక వసతుల అభివృద్ధిలో కలిసి పనిచేయవచ్చని అభిప్రాయపడ్డారు. సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ రంగాల్లో.. ముఖ్యంగా హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, క్రీడల విభాగాల్లో.. పరస్పర సహకారానికి అవకాశాలపై లీడర్లు అభిప్రాయాలు పంచుకున్నారు. రిటైల్ , లైఫ్ సైన్సెస్‌లో రంగాల్లో అవకాశాలపై చర్చించారు. మహిళా సాధికారతకు సంబంధించి స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలపై స్విస్ బృందం ఆసక్తి కనబరిచింది. సహకార అంశాలు పరిశీలించేందుకు త్వరలోనే స్విట్జర్లాండ్ బృందం హైదరాబాద్‌కు వస్తుందని వాడ్ రాష్ట్ర పరిశ్రమలు, ఆర్థిక శాఖ మంత్రి ఇసబెల్ మోరెట్ వెల్లడించారు.

Read Also: గ్రాషా మేషల్​కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>