కలం, వెబ్ డెస్క్ : భర్తపై ఆగ్రహించిన ఓ మహిళ నోట్ల కట్టలను రోడ్డు మీదకు విసేరిన షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) గా మారింది. భర్తతో గొడవతో కోపానికి గురైన మహిళ బాల్కానీ నుంచి సుమారు రూ.1.5 కోట్లు విలువైన నగదును బయటకు విసిరేసింది. ఈ షాకింగ్ ఘటన గ్వాంగ్‌డాంగ్ లోని శాంతౌ నగరంలో జరిగింది.
ఈ విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కొంతమంది ఆ డబ్బును తీసుకునే ప్రయత్నం చేయగా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ ఆ నగదు అసలైనదేనని ధృవీకరించింది. తీసుకున్న వారు డబ్బులను తిరిగి ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
-భర్తపై కోపంతో నోట్ల వర్షం కురిపించిన భార్య
– రూ. 1.5 కోట్లు బాల్కనీ నుంచి విసిరేసిన మహిళ!
-నేల మీద పడ్డ డబ్బును ఏరుకోవడానికి ఎగబడ్డ జనం
– చైనాలోని గ్వాంగ్డాంగ్లోని శాంతౌ నగరంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్!
Woman Throws ₹1.5 Crores Cash from Balcony After Fight… pic.twitter.com/W4qFiYdL8p— Kalam Daily (@kalamtelugu) April 20, 2026
Read Also: మొదటి సంతకానికే హైడ్రాను ఎత్తిపడేస్తా: కేసీఆర్
Follow Us On : WhatsApp

