రేవంత్‌కు షాక్ ఇచ్చిన కేసీఆర్

కలం, వెబ్ డెస్క్:  ఏడాది తరువాత జగిత్యాల బహిరంగ సభతో ప్రజల ముందుకు వచ్చిన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) .. సుమారు గంట పాటు ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన విమర్శలు చేస్తూనే.. ఎక్కడా కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల పేర్లు తీయకుండానే.. ఆరోపణలు సంధించారు. మరీ ముఖ్యంగా.. రేవంత్ పేరు కనీసం ఒక్కసారి కూడా చెప్పకపోవడం గమనార్హం. ప్రసంగం మొత్తంలో కేవలం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేరు మాత్రమే ప్రస్తావించడం గమనార్హం. చివరిసారి ఎల్కతుర్తి సభలో కూడా కేసీఆర్.. రేవంత్ రెడ్డి పేరు తీయకుండా.. కేవలం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు మాత్రమే ప్రస్తావించారు. వ్యూహాత్మకంగానే.. గులాబీ దళపతి రేవంత్ రెడ్డి పేరును బహిరంగ సభల్లో ఎక్కడా తీయకుండా జాగ్రత్త పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: ఎన్టీఆర్​ ను వెన్నుపోటు పొడిచిన జీవన్ రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>