వాహనదారులకు మహబూబ్‌నగర్ SP వార్నింగ్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: జిల్లా ఎస్పీ (Mahabubnagar SP) డి.జానకి వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి, సిబ్బంది మంగళవారం మాడిఫైడ్ సైలెన్సర్లపై తనిఖీలు నిర్వహించారు. మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించి అధిక శబ్దంతో వాహనాలు నడుపుతున్న ద్విచక్ర వాహనాలను గుర్తించి చర్యలు తీసుకున్నారు.

అలాగే మైనర్లు వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లు లేకుండా డ్రైవింగ్ చేయడం లాంటివారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. వీరందరినీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి డీఎస్పీ వెంకటేశ్వర్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. మోడిఫైడ్ సైలెన్సర్ల వల్ల శబ్ద కాలుష్యం పెరుగుతుందని, అలాంటి వాహనాలు నడిపేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>