Mobile Popup Ad
Mobile Popup Ad

మొదటి సంతకానికే హైడ్రాను ఎత్తిపడేస్తా: కేసీఆర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల పరిరక్షణ పేరుతో తీసుకువచ్చిన హైడ్రాపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైడ్రాను ఒక పనికిమాలిన వ్యవస్థగా అభివర్ణించారు. కేసీఆర్, ప్రజలకు మేలు చేయాల్సింది పోయి కీడు చేయడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే మొదటి సంతకంతోనే హైడ్రాను (Hydraa) ఎత్తిపడేస్తామని హెచ్చరించారు. హైడ్రాను పీకేసి చెరువులోనే పడేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్యులు ఇబ్బంది పడకూడదని, విధ్వంసకర పాలన పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఈ సందర్భంగా హితవు పలికారు.

Read Also: కాంగ్రెస్ వల్లే రైతులకు ఉచిత కరెంట్​ : సీఎం రేవంత్​ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>