కలం, వెబ్ డెస్క్ : నల్లగొండ (Nalgonda) జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడి భార్యను అడ్డు తొలగించుకునేందుకు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఉదంతం నల్లగొండ జిల్లా నాంపల్లిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన నగేష్, మమత భార్య భర్తలు. అయితే భర్త నగేష్ కు సుజాత అనే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. కాగా సుజాతకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఇద్దరు కూతుళ్లు ఒకరిని పెళ్లి చేసుకోవాలంటూ నగేష్ పై గత కొంతకాలంగా సుజాత ఒత్తిడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. అయితే నగేష్ భార్య మమత లేకుంటే తన కూతుళ్లలో ఒకరిని పెళ్లి చేసుకుంటాడని సుజాత భావించింది. అందులో భాగంగానే పక్కా ప్లాన్ తో శనివారం నగేష్ భార్య మమత తన ఇంటిలో చంటి పాపకు పాలిస్తుండగా, సుజాత బాటిల్ లో పెట్రోల్ తీసుకుని వెళ్లి మమతపై పోసి నిప్పంటించింది. వెంటనే అప్రమత్తమైన మమత తన చిన్నారిని పక్కకు విసిరేసింది. కానీ అప్పటికే పూర్తిస్థాయిలో మంటలు అంటుకోవడంతో మమత సజీవ దహనం అయింది. చిన్నారి మాత్రం చావు బతుకులో కొట్టుమిట్టాడుతోంది. కాగా సుజాత స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.


