కలం, వెబ్ డెస్క్ : స్కూటీ పై వెళ్తున్న ఓ మహిళ ఏనుగును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏనుగు దంతం విరిగి ముక్కలైంది. ఈ విచిత్ర ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand) లో జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ మహిళా టీచర్ తన విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తోంది.
ఈ క్రమంలో ఖతీమా రోడ్డు వద్దకు రాగానే అడవిలోంచి ఓ ఏనుగు అకస్మాత్తుగా బయటకు వచ్చింది. మహిళ వేగంగా వెళ్లి ఏనుగును గుద్దుకోవడంతో ఏనుగు దంతం విరిగిపోయి మూడు ముక్కలు అయింది. మహిళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఘటనపై వెరైటీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
A female teacher crashed her Activa straight into an elephant on Khatima Road in Uttarakhand😭
The collision was so intense that the elephant’s tusks broke off and fell on the road.
The poor elephant somehow got up & ran away toward the jungle in fear. https://t.co/D8Lz7czUMT
— Bhakt Prahlad🚩 (@RakeshKishore_l) May 20, 2026
Read Also: కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు! … ప్రధాని ఏమన్నారంటే?
Follow Us On: Sharechat

