కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో అనూహ్య పరిణామాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్‌గా మారింది. మమతా బెనర్జీ ఓటమిపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. మమత అవుట్ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసులు (Police) బహిరంగంగా రాజకీయ నినాదాలతో వేడుకలు జరుపుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట షేర్ అవుతున్నాయి.

