కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాన్సువాడ నుండి పవిత్ర శబరిమల క్షేత్రం వరకు పాదయాత్రగా బయలుదేరుతున్న “సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర” కు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పాదయాత్రను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, అయ్యప్ప గురుస్వాములు, స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో విజయవంతం చేశారు.

