రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలి: ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌

కలం, ముధోల్‌: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement Centres) సద్వినియోగం చేసుకోవాలని ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ (MLA Pawar Ramarao Patel) సూచించారు. గురువారం ముధోల్‌ మండలం వడ్తాల్‌, లోకేశ్వరం మండలం కనకాపూర్‌, అబ్దుల్లాపూర్‌, ధర్మోరా, పంచగుడి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ-గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, బి-గ్రేడ్‌ ధాన్యానికి రూ.2,441 మద్దతు ధర లభిస్తుందని తెలిపారు.

ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. రైతు భరోసా నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కరిపే రమేష్‌, సునీల్‌, భోజన్న, సంజీవ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బీజేపీ సీనియర్‌ నాయకులు నర్సాగౌడ్‌, ముధోల్‌ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిష్టయ్య, మాజీ సర్పంచ్‌ శ్రీధర్‌, బద్దం గంగారెడ్డి, బీజేపీ లోకేశ్వరం మండల అధ్యక్షుడు సాయన్న, సంటెన్న, జయసాగర్‌రావు, మంద భాస్కర్‌, వెంకట్‌రెడ్డి, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>