ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్

కలం, వెబ్ డెస్క్: ఏపీలో జిల్లా పరిషత్, మండల పరిషత్ (AP MPTC ZPTC) ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికే ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతిస్తున్నారు. తుఫాన్ కారణంగా వర్షాలు పడటంతో ఉదయం కాస్త ఓటింగ్ శాతం నెమ్మదించగా.. మధ్యాహ్నానికి పుంజుకుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 65 నుంచి 68 శాతం మధ్య పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో మొత్తం 659 జడ్పీటీసీ, 9,821 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఇందులో 77 జడ్పీటీసీ, 2051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 జడ్పీటీసీ స్థానాలకు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నవంబర్‌ 7న ఓట్ల లెక్కింపు, రిజల్ట్ వెల్లడవనున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>