టీడీపీ మహానాడు వేదిక ఖరారు

కలం, వెబ్‌ డెస్క్ : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు (TDP Mahanadu) వేదిక ఖరారైంది. నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో కిసాన్ సెజ్ భూముల్లో ఈ వేడుకలను నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. రాష్ట్రం నలుమూలల నుండి భారీగా తరలివచ్చే కార్యకర్తలు, నాయకుల కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, కీలక తీర్మానాలపై ఈ వేదికగా చర్చించనున్నారు. నెల్లూరులో జరగనున్న ఈ మహానాడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>