Mobile Popup Ad
Mobile Popup Ad

నిజాంపేట్‌లో అగ్నిప్రమాదం.. ఫర్నిచర్‌ దుకాణాలు దగ్ధం

కలం,వెబ్‌ డెస్క్‌: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్‌ (Nizampet)లో అర్ధరాత్రి వేళ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వరుసగా ఉన్న ఆరు ఫర్నిచర్ దుకాణాలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. వారు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>