గుడిరేవులో పుష్కర ఘాట్‌.. ఎమ్మెల్యే బొజ్జు హామీ

కలం, ఖానాపూర్‌: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామంలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ పద్మల్‌పురి కాకోబాయి అమ్మవారిని (Kako Bai Temple) ఖానాపూర్‌ ఎమ్మెల్యే, నిర్మల్‌ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకోబాయి అమ్మవారు ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవమని, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఇటువంటి పుణ్యక్షేత్రాలు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

దండారి గుస్సాడి కళాకారులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. ఈ వారంలోగా మంజూరైన నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గుడిరేవు వద్ద పుష్కర ఘాట్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌తో కలిసి సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఘాట్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎంపీ గూడెం నగేష్‌, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పలువురు ఆదివాసీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>