మనమే ఫేమస్ కపుల్.. మోదీతో ఇటలీ ప్రధాని మెలోని సంభాషణ

కలం, వెబ్ డెస్క్: ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల (Modi – Meloni) మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వీరిద్దరి సంభాషణ మరోసారి వైరల్‌గా మారింది. గ్రూప్ ఫొటో దిగే సమయంలో మోదీ, మెలోని కలుసుకోగా, సోషల్ మీడియాలో తమకున్న ప్రజాదరణను మోదీ ప్రస్తావించారు. దీనికి స్పందించిన మెలోని.. ‘అవును, ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే ఫేమస్ కపుల్’ అంటూ సరదాగా మాట్లాడింది. నెటిజన్లు వీరిద్దరి పేర్లను కలిపి మెలోడీ (Melodi) అంటూ పిలవడం విశేషం.

ఇటీవల ప్రధాని మోదీ రోమ్ పర్యటనకు వెళ్లిన సమయంలో మెలొడీ చాక్లెట్ ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ‘చాక్లెట్ చాలా బాగుంది, ఈ స్వీట్ గిఫ్ట్‌కు ధన్యవాదాలు’ అంటూ మెలోని ఆ చాక్లెట్ ప్యాకెట్‌తో మోదీతో కలిసి దిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో 2024, 2025 అంతర్జాతీయ సదస్సుల సమయంలోనూ మోదీతో దిగిన సెల్ఫీలను, వీడియోలను మెలోని షేర్ చేస్తూ ‘హలో ఫ్రమ్ మెలోడీ టీమ్’ అంటూ క్యాప్షన్లు పెట్టారు.

ఈ ఘటనలు అంతర్జాతీయ వేదికలపై ఇద్దరు ప్రపంచ నేతల (Modi – Meloni) మధ్య ఉన్న చక్కని స్నేహపూర్వక బంధాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయితే, ఈ ‘మెలోడీ’ బంధం కేవలం సోషల్ మీడియా సందడికో, ఫొటోలకో మాత్రమే పరిమితం కాలేదు. ఇరు దేశాల విదేశాంగ విధానానికి బలమైన పునాదిగా మారుతోంది.

Read Also: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ముంబై తాత స్టోరీ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>