వనపర్తిలో 82 మంది బాల కార్మికులకు విముక్తి!

కలం, వనపర్తి: వనపర్తి జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-12లో 82 మంది బాల కార్మికులను రక్షించినట్లు జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి (Wanaparthy SP Sunitha Reddy) తెలిపారు. జులై 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 78 మంది బాలురు, నలుగురు బాలికలను గుర్తించి విముక్తి కల్పించినట్లు వెల్లడించారు. చట్టవిరుద్ధంగా పనిలో పెట్టుకున్న 26 మంది యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రక్షించిన బాలలకు సంబంధిత శాఖల సమన్వయంతో పునరావాసం కల్పించి, తల్లిదండ్రులకు బాలల హక్కులు, నిర్బంధ విద్య, బాల కార్మిక వ్యవస్థ దుష్పరిణామాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

ఆపరేషన్ ముస్కాన్ విజయవంతానికి పోలీసు, కార్మిక, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, విద్య, వైద్యశాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని ఎస్పీ అభినందించారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరీ చేయించడం, బలవంతపు భిక్షాటనకు గురి చేయడం వంటివి నేరమని హెచ్చరించారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపించినా లేదా బాలలపై వేధింపులు, దోపిడీ జరుగుతున్నట్లు తెలిసినా ఛైల్డ్ హెల్ప్‌లైన్ 1098, డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>