ధాన్యం బకాయిలు చెల్లించాలని బీజేపీ ఆందోళన

కలం, కరీంనగర్ బ్యూరో: రైతుల ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada)లో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. చెక్కపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్డుపై ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ అస్వస్థతకు గురై కుప్పకూలారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అనంతరం తెలంగాణ చౌక్‌లో బైఠాయించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే, రేపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వేములవాడకు రానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అరెస్టయిన నేతలను పరామర్శించడంతో పాటు రైతుల ధాన్యం బకాయిల అంశంపై తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీంతో వేములవాడ పట్టణంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>