Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో రోడ్డుకు ట్రంప్ పేరు.. కవిత ఆగ్రహం

కలం, హైదరాబాద్ : హైదరాబాద్‎లోని అమెరికన్ కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పేరు పెట్టడంపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఒక్క మహనీయుని పేరు సీఎం రేవంత్ రెడ్డికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అని పేరు పెట్టడం…తెలంగాణ ప్రజలను అవమానించటమేనని ఆమె మండిపడ్డారు.

తెలంగాణకు ట్రంప్ (Trump) ఏం చేశాడని ఆయన పేరు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రంప్ విధానాల కారణంగా అమెరికాలో తెలంగాణ పిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడి రోడ్లకు ఆయన పేరు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రేవంత్ రెడ్డికి ఆయన కుటుంబానికి అమెరికా వీసాలు సులభంగా క్లియర్ అవటానికి తప్ప ఈ నిర్ణయం దేనికి పనికిరాదని కవిత (Kavitha) విమర్శించారు.

Read Also: మనమే ఫేమస్ కపుల్.. మోదీతో ఇటలీ ప్రధాని మెలోని సంభాషణ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>