కలం, వెబ్ డెస్క్: ఈతరం యువతలో కొందరు చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతుంటారు. “మా వల్ల కాదులే” అని చేతులెత్తేస్తుంటారు. తమ చుట్టూ ఉన్న పరిస్థితులను తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. కానీ, ఆశావాదం ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడీ ఈ ముంబై తాత. రోజుకు 12 గంటలపాటు కష్టపడుతూ ఆయన సాగిస్తున్న జీవనపోరాటం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ముంబైలో రోడ్డు పక్కన స్నాక్స్ అమ్ముతున్న ఈ తాత కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కంటెంట్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ తన ఇన్‌స్టాలో వీడియో షేర్ చేయడంతో ఆయన జీవితం వెలుగుచూసింది. ఫుట్‌పాత్‌పై ప్యాకెట్లను సర్దుతున్న ఆ వృద్ధుడితో మాట్లాడింది. ఆయన పేరు మన్సుఖ్ కాకా (Mansukh Kaka) అని, అతని వ్యాపారానికి అండగా నిలవాలని నెటిజన్లను కోరింది.
మన్సుఖ్ కాకా తన జీవితంలో ఎక్కువ భాగం ఒక చీరల దుకాణంలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేశారు. అయితే కోవిడ్-19 సమయంలో ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఆ ఉద్యోగం కోల్పోయారు. ఆ సమయంలో తండ్రిని చూసుకోవడం కోసం ఆయన కుమారుడు కూడా తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మన్సుఖ్ కాకా తన కుటుంబ పోషణ కోసం ఇంటికి సమీపంలోనే రోడ్డు పక్కన స్టాల్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన రోజుకు దాదాపు 12 గంటల పాటు కష్టపడుతున్నాడు. ఆయన సోదరి ఇంట్లోనే 20 రకాల స్నాక్స్‌ను తయారుచేస్తూ విక్రయిస్తారు. ఇంత కష్టపడినా, రోజుకు కేవలం రూ. 300 మాత్రమే ఆదాయం వస్తుంది.
వయసు పైబడినప్పటికీ మన్సుఖ్ కాకా (Mansukh Kaka) చూపిస్తున్న పట్టుదల, క్రమశిక్షణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన తన స్టాల్‌లోని ప్రతి అమ్మకం, ఖర్చుల వివరాలను డైరీలో రాయడం, ప్రొఫెషనల్‌గా కనిపించడం వంటి దృశ్యాలు వీడియోలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు ఆయన గౌరవాన్ని కొనియాడారు. ఆ స్టాల్ చిరునామాను అడుగుతూ సపోర్ట్ చేస్తున్నారు. ‘తాత యూఆర్ గ్రేట్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కన్నీళ్లు తెప్పిస్తున్న ముంబై తాత కథ..
-ముంబైలో రోడ్డు పక్కన స్నాక్స్ అమ్ముతున్న ఓ తాత కథ సోషల్ మీడియాలో వైరల్
– నేటి యువతకు ఈ తాత ఒక రోల్ మోడల్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలుInspirational Journey of 82-Year-Old Mansukh Kaka Selling Snacks in Mumbai Goes Viral#MansukhKaka… pic.twitter.com/jHT37Xw1P3
— Kalam Daily (@kalamtelugu) June 16, 2026
Read Also: అమెజాన్ జాబ్‌కు గుడ్‌బై.. ఉబెర్ డ్రైవర్‌గా హైదరాబాద్ వ్యక్తి, వైరల్!
Follow Us On : WhatsApp

