Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో మంత్రుల సవాల్.. ‘టెండర్లలో అవినీతి నిరూపిస్తారా?’

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ గురుకుల పాఠశాలల టెండర్లలో రూ.2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. కరీంనగర్‌లో (Karimnagar) మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్‌రావు వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. టెండర్ల విలువే రూ.1,140 కోట్లు ఉంటే, రూ.2 వేల కోట్ల స్కాం ఎలా జరుగుతుందని మంత్రులు ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న శాఖలపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

కరీంనగర్‌లో (Karimnagar) వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆర్టీసీ బస్సులో విద్యార్థులతో కలిసి ప్రయాణం చేశారు. విద్యార్థులకు షూస్ , బట్టలు, ఇతర సామగ్రిపై మంత్రులుగా తామే సంతకాలు పెట్టామన్నారు. సీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో దేశంలో ఎవరైనా టెండర్‌లో పాల్గొనే విధంగా ప్రక్రియ రూపొందించామన్నారు. విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎస్సీ గురుకుల భవనమైనా ఏర్పాటు చేశారా?.. అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ మంత్రులపై అవహేళన, అక్కసు ఎందుకని మంత్రులు పొన్నం, అడ్లూరి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే లక్ష్యంతోనే SIR ప్రక్రియ తీసుకొచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు.

Read Also: మనమే ఫేమస్ కపుల్.. మోదీతో ఇటలీ ప్రధాని మెలోని సంభాషణ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>