కలం, వెబ్ డెస్క్: కమర్షియల్ గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచడంపై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కమర్షియల్ గ్యాస్ ధర (Commercial Gas Rates) పెంపుతో సామాన్యుడిపై పెను భారం పడుతోందని మండిపడ్డారు. 19 కేజీల గ్యాస్ ధరను రూ.993కు అంటే సుమారు రూ.1000 పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఒక్కసారిగా 30 నుండి 35 శాతం పెంచడంతో హోటళ్లు, కేఫ్ లు రెస్టారెంట్లతో సహా చిన్న తరహా వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పచ్ఛిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన 24 గంటలు పూర్తి కాగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని.. ముమ్మాటికీ ఇది సామాన్య ప్రజలను మోసం చేయడమే అవుతుందని విమర్శించారు. కేంద్రం పెంచిన ధరలతో 19 కేజీల గ్యాస్ ధర రూ.3000కు మించి పోయిందని తెలిపారు. కమర్షియల్ గ్యాస్ ధర పెంపుతో సామాన్యుల జీవన ప్రమాణాలపై కోలుకోలేని దెబ్బ పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే స్పందించి ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహారించుకోవాలని మంత్రి (Uttam Kumar Reddy) డిమాండ్ చేశారు.
Read Also: విదేశీ గడ్డపై భారతీయ సంస్కృతి.. ఉత్సవాలకు జర్మన్ సర్కార్ బందోబస్తు
Follow Us On: X(Twitter)

