కలం, నిర్మల్: మహానీయుడు అన్నా భావు సాఠే ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) అన్నారు. అన్నా భావు సాఠే 106వ జయంతి సందర్భంగా శనివారం నిర్మల్ (Nirmal) జిల్లా భైంసా (Bhainsa) పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్నా భావు సాఠే రచనలు సమాజంపై చెరగని ముద్ర వేసాయని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.

