కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) భారీ ఊరట లభించింది. బీజేపీ, ఆరెస్సెస్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లక్నో బెంచ్ కోర్ట్ ఉత్తర్వులిచ్చింది. దీన్ని రాహుల్ తరఫు లాయర్లు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయగా.. లక్నో బెంచ్ ఆదేశాలను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది.
రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) యూపీలో జరిగిన పలు సభల్లో మాట్లాడుతూ.. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం దేశ రాజ్యాంగాన్ని దెబ్బతీస్తోందని.. విద్వేషంతో దేశాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఆర్ఎస్సెస్ నకిలీ దేశభక్తి ఉన్న సంస్థగా కూడా విమర్శించారు. దీనిపై పలువురు బీజేపీ నేతలు అలహాబాద్ హైకోర్టు పరిధిలోని లక్నో బెంచ్ లో కేసు వేశారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించగా.. తాజాగా పైకోర్ట్ ఈ తీర్పును నిలిపివేసింది.
Read Also: లేడీ బాస్ లైంగిక వేధింపులు.. అమెరికాలో జేపీ మోర్గాన్ కేసు కలకలం!
Follow Us On: Instagram

