భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump)కు భయపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలను అమెరికన్ సింగర్ మెరీ మిల్‌బెన్(Mary Millben) తీవ్రంగా ఖండించారు. ‘‘రాహుల్ గాంధీ.. మీరు తప్పుగా అనుకుంటున్నారు. ప్రధాని మోదీ.. గేమ్ లాంగ్ రన్ బాగా అర్థం చేసుకున్నారు. అమెరికాతో ఆయన దౌత్యం చాలా వ్యూహాత్మకం. కొందరే అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ మోదీ(PM Modi).. భారత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తారు. ఇండియాకు ఏది బెస్టో అది చేస్తారు. ఏ దేశ అధ్యక్షుడు, ప్రధాని అయినా అదే చేస్తారు. ఇలాంటి నాయకత్వాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. మళ్లీ మీరు మీ పాత నినాదం ‘ఐ హేట్ ఇండియా’కు రండి’’ అని ఘాటుగా రిప్లై ఇచ్చారు.
అయితే ఇటీవల మోదీ.. ట్రంప్‌కు భయపడ్డారంటూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) పెట్టి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. భయం వల్లే రష్యా చమురును ఇండియా కొనదని ట్రంప్‌ను ప్రకటించనిస్తున్నారని, పదేపదే తిరస్కరణ వస్తున్నా అభినందనల మెసేజ్‌లు పంపుతున్నారని, అమెరికాకు భారత ఆర్థిక మంత్రి టూర్‌ను రద్దు చేశారంటూ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాటికే ఇప్పుడు మెరీ(Mary Millben) బదులిచ్చారు.
Read Also: ఆర్‌సీబీ అమ్మకం.. రేసులోకి సుఖేష్

