భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రత్యేక మెమెంటో అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆది కర్మయోగి అభియాన్(Adi Karmayogi Abhiyan)పై నేషనల్ కాన్‌క్లేవ్ 2025 నిర్వహించారు. ఇందులో భారతదేశ ప్రతిస్పందనాత్మక పాలన ఉద్యమంపై ఈ మెమెంటోను కేంద్ర ఆదివాసీ వ్యవహారాల మంత్రి జువల్ ఓరమ్.. రాష్ట్రపతి ముర్ముకు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి.. ఆది కర్మయోగి అభియాన్‌లు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, ఇంటిగ్రేటెడ్ ట్రైబర్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
‘‘అభివృద్ధి చెందిన భాతదేశంవైపు మనం చేస్తున్న పయనం.. సమాజంలోని అన్ని సెక్షన్ల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. కొన్నేళ్లలో ఆదివాసీ వర్గాల సంపూర్ణ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని ముర్ము(Droupadi Murmu) వివరించారు.
Read Also: మోదీకి అమెరికన్ సింగర్ సపోర్ట్.. రాహుల్‌కు స్ట్రాంగ్ రిప్లై..

