epaper
Tuesday, November 18, 2025
epaper

ఆర్‌సీబీ అమ్మకం.. రేసులోకి సుఖేష్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని ఫేమస్ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ని కొనడానికి భారీ పోటీ నెలకొంది. తాజాగా ఈ రేసులోకి ఎల్‌ హోల్డింగ్స్ ప్రమోటర్, ఛైర్మన్ సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మనీలాండరింగ్ సహా అనేక ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే తాజాగా ఆర్‌సీబీ కొనుగోలుకు ఆఫర్ చేస్తూ ఫ్రాంఛైజీ యాజమాన్యానికి ఓ లేఖ రాశారు. ఈ మేరకు ఫ్రాంఛైజీని కొనడానికి సుముఖత వ్యక్తం చేస్తూ ఫ్రాంఛైజీ ఓనర్‌కు ఓ లేఖ రాశారు. ఆర్‌సీబీని కొనుగోలు చేయడానికి మేము ఇంట్రస్ట్‌గా ఉన్నామని తెలిపారు. ‘‘మీ బ్రాండ్‌కు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత అధికారిక ఆఫర్ ఇవ్వాలని ఎల్ఎస్ హోల్డింగ్స్‌ భావిస్తోంది. అందుకు ఫ్రాంఛైజీకి 100 కోట్ల అమెరికా డాలర్లు ఆఫర్ చేస్తున్నాం. మొత్తం అనుబంధ హక్కులు, ట్రేడ్ మార్కులు, ప్లేయర్ కాంట్రాక్ట్‌లు, లీగ్ అర్హతతో సహా అన్నింటికి సంబంధించి ఒప్పందం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు మరో గ్రూప్ అందిస్తున్న ఆఫర్ కన్నా రెట్టింపు ఆఫర్ చేస్తున్నాను. ఇటీవల అమ్ముడైన మరో ఫ్రాంఛైజీ కన్నా ఎక్కువ ఆఫర్ చేశాం’’ అని తన లేఖలో పేర్కొన్నారు.

‘‘48 గంటల్లో మొత్తం సెటిల్‌మెంట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మూడో పార్ట్‌నర్ అవసరం లేదు. ఇది మీకు, నాకు సమయాన్ని ఆదా చేస్తుంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ(RCB)కి ఉన్న విలువ, సామర్థ్యం మాకు బాగా తెలుసు. వ్యూహాత్మక పెట్టుబడులు, అంతర్జాతీయ ఎక్స్‌పాన్షన్ ద్వారా దానిని మరింత అధికం చేయాలని కోరుకుంటున్నాం. వ్యక్తిగతంగా ఆర్‌సీబీ నా హోమ్ టీమ్. దానికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఒప్పందం జరిగితే పెద్దపెద్ద కలలు కనే వారికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఏ కలా పెద్దది కాదు.. దేనిని అయినా సాధించగలమని నిరూపిస్తుంది. అంతేకాకుండా నా భాగస్వామి, లేడీ లవ్ జాక్వెలిన్‌కు ఒక స్పోర్ట్స్ టీమ్‌ను సొంతం చేసుకోవాలన్న కల ఉంది. అనేక ఇతర స్పోర్ట్స్ అందుబాటులో ఉన్నా ఐపీఎల్‌ కంటే పెద్దది ఏదీ ఉండదు. ఈ ఒప్పందం ఆమెకు బహుమతి అవుతుంది’’ అని పేర్కొన్నారు.

ఈ సందర్బంగానే ప్రస్తుతం జుడిషల్ కస్టడీలోని తనపై ఉన్న ఆరోపణల గురించి కూడా సుఖేష్.. స్పష్టతనిచ్చారు. తనపై ఉన్నవన్నీ ఆరోపణలే తప్ప.. నిరూపితాలు ఏమీ కావని చెప్పారు. అదే విధంగా ఎల్ఎస్ హోల్డింగ్స్‌పై ఎటువంటి చట్టపరమైన కేసులు లేవని, అది బ్రిటిషర్ వర్జిన్ దీవిులలో నమోదు చేయబడిందని వెల్లడించారు. అంతేకాకుండా ఆ సంస్థ USA, లండన్, దుబాయ్, సింగపూర్, హాంకాంగ్, రష్యా, స్వీడన్‌లలో పనిచేస్తుందని తెలిపారు.

‘‘మాతో మీరు చర్చలను కొనసాగించడం కోసం అనుకున్న మొత్తం నగదును ముందుగానే ఎస్క్రోలో జమ చేయడానికి రెడీగా ఉన్నాం. ఆఫర్ పరంగా, నివేదికల ప్రకారం మీకు మెరుగైన ఆఫర్ ఉందని మేము అర్థం చేసుకున్నాము. కానీ మా ఆఫర్ మాత్రం మీరు ధృవీకరించిన 48 గంటల్లోపు మేము అమలు చేయగల వాస్తవిక ఆఫర్. మేము మీ అన్ని షరతులకు అనుగుణంగా ఉంటాము. పరస్పర ప్రారంభంగా ఈ ఉద్దేశ్య లేఖను మీరు అధికారికంగా అంగీకరిస్తారని మేము ఎదురుచూస్తున్నాము’’ అని సుఖేష్ తన లేఖలో రాసుకొచ్చారు.

Read Also: ‘రాజాసాబ్’ ఎంట్రీకి అంతా రెడీ..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>