తెలంగాణ నూతన డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy)పై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. శివధర్ రెడ్డి ఖాకీ బుక్‌లో మంత్రులకు మాత్రమే వేరే రూల్స్ ఉన్నాయని విమర్శించారు. మంత్రులు ఏం చేసినా, ముఖ్యమంత్రి సన్నిహితులు చెలరేగుతున్నా వారిపై ఎటువంటి చర్యలు ఉండట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టెండర్లు వేయొద్దని మంత్రులు బెదిరింపులకు గురిచేసినా, సీఎం సన్నిహితులు తుపాకులతో తిరిగినా కేసులు ఉండవు. అదే ప్రతిపక్ష నేతలు.. ఏదైనా సోషల్ మీడియా పోస్ట్‌ను రీపోస్ట్ చేసినా కేసులు, అరెస్ట్ అంటున్నారు’’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు(Harish Rao) ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సమయంలో పొలిటికల్ బుక్స్ అంశంపై శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు పింక్, బ్లూ, రెడ్, యెల్లో లాంటి బుక్స్ ఏమీ ఉండవని, తమదంతా కూడా ఖాకీ బుక్‌యేనని అన్నారు. అంతేకాకుండా అందులో అందరికీ రూల్స్ ఒకేలా ఉంటాయని పునరుద్ఘాటించారు.
Read Also: ఆర్‌సీబీ అమ్మకం.. రేసులోకి సుఖేష్

