epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

ట్రంప్​కు ఇండియన్ ఝలక్​​.. కీలక ఫైల్స్​ చాట్​జీపీటీలో!

కలం, వెబ్​డెస్క్​: భారత సంతతి అధికారి ఒకరు (Madhu Gottumukkala) అమెరికా ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేశారు. యూఎస్​ ప్రభుత్వానికి చెందిన కీలక సమాచారం ఉన్న ఫైల్స్​ను చాట్​జీపీటీలో అప్​లోడ్​ చేశారు. దీంతో ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ సహాయ బృందంలో భారత సంతతి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్​కు చెందిన మధు గొట్టుముక్కల (Madhu Gottumukkala) పనిచేస్తున్నారు. ఈయన గత మేలో అమెరికా డిపార్ట్​మెంట్​ ఆఫ్​ హోమ్​ల్యాండ్​(డీహెచ్​ఎస్​) కు చెందిన యూఎస్​ సైబర్​సెక్యూరిటీ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సెక్యూరిటీ ఏజెన్సీ(CISA) తాత్కాలిక డైరెక్టర్​గా నియమితులయ్యారు. ఈ హోమ్​ల్యాండ్​ ఉద్యోగులు చాట్​జీపీటీ వాడడంపై నిషేధం ఉంది. అయితే, ఏఐ చాట్​బాట్​ కోసం అనేక సార్లు ఒత్తిడి చేసిన మధు ఆ తర్వాత ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అనంతరం చాట్​జీపీటీ పబ్లిక్​ వెర్షన్​లో అమెరికా ప్రభుత్వానికి చెందిన అనేక ఫైల్స్​ అప్​లోడ్​ చేశారు. ఇందులో సీఐఎస్​ఏ కాంట్రాక్టులు ఉన్న ఫైల్స్​తోపాటు, ​అత్యంత కీలక సమాచారం కలిగినవీ ఉన్నాయి.

దీనిపై గతేడాది ఆగస్టులోనే సీఐఎస్​ఏ ఇంటర్నల్​ సెక్యూరిటీ సెన్సార్లు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం పూర్తిగా బయపడి, ఇందులో మధు గొట్టుముక్కల  పాత్ర ఉన్నట్లు తేలింది. అప్​లోడ్​ చేసిన సమాచారం ఓపెన్​ ఏఐకి చేరడంతో.. ఇందులోని ఫైల్స్​కు సంబంధించిన విషయం గురించి ఎవరైనా అడిగితే సమాధానం వచ్చే ప్రమాదం ఉంది. మొత్తం తతంగంపై డీహెచ్ఎస్​ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>