మోడీ, అమిత్​ షాల వల్లే బతికున్నా.. నుపుర్​ శర్మ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : ప్రధాని మోడీ (PM Modi), హోం మంత్రి అమిత్​ షాల (Amit Shah) వల్లే తాను బతికి ఉన్నానని బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్​ శర్మ (Nupur Sharma) కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మద్​ ప్రవక్తపై నుపుర్​ శర్మ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపిన తెలిసిందే. అనంతరం పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. నాలుగు సంవత్సరాల తరువాత శనివారం సేవ భారతి ఢిల్లీ విభాగం నిర్వహించిన మహిళా సదస్సులో నుపుర్​ శర్మ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా తాను అనుభవించిన కష్టాలను ఆమె వివరించారు. నాలుగేళ్లుగా స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నానని చెప్పారు. దేశ నాయకత్వం అందించిన మద్దతు, రక్షణ కారణంగానే సురక్షితంగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.

‘నా కంటే బాధాకరమైన జీవితాన్ని ఏ సోదరి కూడా అనుభవిస్తుందని అనుకోను. స్వేచ్ఛను కోల్పోయి నాలుగేళ్లు అయింది. కానీ నేను సజీవంగా, సురక్షితంగా ఉన్నానంటే ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్​ షా కారణం. వారి మద్దతు లేకపోతే నేను, నా కుటుంబం జీవించి ఉండేది కాదు’ అని నుపుర్​ శర్మ చెప్పుకొచ్చారు. కాగా, మే 2022లో ఓ మీడియా ఛానల్​ లో జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ సందర్బంలో నుపుర్​ శర్మకు (Nupur Sharma) మద్దతు తెలిపిన కన్హయ్య లాల్​, ఉమేశ్​ కోలే హత్యకు గురయ్యారు. దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి.

Read Also: ఆకాశంలో అద్భుతం.. 104 మంది స్కైడైవ‌ర్ల ప్ర‌పంచ రికార్డ్‌!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>