Mobile Popup Ad
Mobile Popup Ad

ఆకాశంలో అద్భుతం.. 104 మంది స్కైడైవ‌ర్ల ప్ర‌పంచ రికార్డ్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: అమెరికాలోని ఫ్లోరిడా (Florida) ఒక అరుదైన ప్రపంచ రికార్డుకు వేదికైంది. 2025 నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు చెందిన 104 మంది స్కైడైవర్లు ఒకేసారి ఆకాశం నుండి దూకి సరికొత్త చరిత్ర సృష్టించారు. వీరందరూ గాలిలో ఒకరి పారాచూట్‌ను మరొకరు అనుసంధానం చేస్తూ ఒక భారీ స్టార్‌ ఆకృతిని నిర్మించారు. ఇలా గాలిలో పారాచ్యుట్లను ఒక క్రమ పద్ధతిలో కలిపి ఆకృతులను రూపొందించడాన్ని ‘కానోపీ రిలేటివ్ వర్క్’ అని పిలుస్తారు. ఈ రికార్డు కోసం క్రీడాకారులు నెలల తరబడి శిక్షణ పొందారు. గతంలో 2007లో నమోదైన 100 మంది స్కైడైవర్ల రికార్డును తిరగరాస్తూ భారీ స్థాయిలో ఫార్మేషన్ చేశారు. లేక్ వేల్స్‌లో ఉన్న జంప్ ఫ్లోరిడా స్కైడైవింగ్ కేంద్రంలో జ‌రిగిన ఈ ఫార్మేష‌న్‌ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read Also: మోడీ, అమిత్​ షాల వల్లే బతికున్నా.. నుపుర్​ శర్మ కీలక వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>