కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో కాంగ్రెస్ (Congress) పార్టీ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు మించి ఫలితాలు రాబట్టేలా కార్యాచరణ చేస్తోంది. ఇప్పటికే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి స్టార్ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. మొత్తం 20 మందికి చోటు కల్పించింది.
ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, పలువురు పార్టీ ముఖ్య నేతలను స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది.
20 మంది స్టార్ క్యాంపెయినర్లు వీరే..
మీనాక్షి నటరాజన్
సీఎం రేవంత్ రెడ్డి
మహేష్ కుమార్ గౌడ్
భట్టి విక్రమార్క
ఉత్తమ్ కుమార్ రెడ్డి
దామోదర్ రాజనరసింహ
వంశీ చంద్ రెడ్డి
శ్రీధర్ బాబు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పొన్నం ప్రభాకర్
సీతక్క
కొండా సురేఖ
తుమ్మల నాగేశ్వరరావు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జూపల్లి కృష్ణారావు
వివేక్
అడ్లూరి లక్ష్మణ్
శ్రీహరి
అజరుద్దీన్
హన్మంతరావు


