నేడు అమ‌రావ‌తిలో పొట్టి శ్రీరాములు విగ్ర‌హావిష్క‌ర‌ణ..!

క‌లం, వెబ్ డెస్క్‌: అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు (Potti Sriramulu Statue) 125వ జ‌యంతి సంద‌ర్భంగా రాజ‌ధాని అమ‌రావ‌తి (Amaravati)లో ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్ర‌హాన్ని సీఎం చంద్ర‌బాబు నేడు ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పాల్గొన‌నున్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన‌ 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల క్యాంస విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 6.8 ఎక‌రాల విస్తీర్ణంలో మోమోరియ‌ల్ ఏర్పాటు చేశారు.

పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్ర‌బాబు నివాళి అర్పించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగం ప్ర‌తి ఒక్క‌రికీ స్పూర్తిదాయ‌కం అని, మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశార‌ని చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశార‌ని గుర్తు చేశారు.

ఇంకా పెండింగ్‌లోనే ప‌నులు…

విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి కానీ, ఇంకా చాలా ప‌నులు పెండింగ్‌లో ఉండ‌టంపై విమ‌ర్శ‌లు వ్యక్త‌మ‌వుతున్నాయి. అయితే నేడు పొట్టి శ్రీరాములు జ‌యంతి సంద‌ర్భంగా ఆవిష్క‌ర‌ణ చేస్తే బాగుంటుంద‌ని భావించి ప్ర‌భుత్వం వేగ‌వంతంగా విగ్ర‌హ నిర్మాణం పూర్తి చేసింది. ఈ విగ్ర‌హ నిర్మాణ ప‌నులు గ‌తేడాది సెప్టెంబ‌ర్ 11న మొద‌ల‌యయ్యాయి. విగ్ర‌హం చుట్టూ గ్రీన‌రీ, ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>