Mobile Popup Ad
Mobile Popup Ad

11మంది మావోయిస్టుల లొంగుబాటు

కలం, వెబ్​ డెస్క్​ : దేశంలో మావోయిస్టుల లొంగుబాటు (Maoists Surrender) కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒడిశాలోని కళహండి జిల్లాలోని భవానీపట్న రిజర్వ్​ పోలీస్​ గ్రౌండ్​ లో ఆదివారం 11మంది మావోయిస్టులు (Maoists Surrender) లొంగిపోయారు. ఒడిశా డీజీపీ యోగేశ్​ బహదూర్​ ఖురానియా సమక్షంలో ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. లొంగిపోయిన వారిలో బన్సధర – గుముసర్​ – నాగబలి విభాగానికి చెందిన వారు ఉండగా డివిజనల్​ కమిటీ మెంబర్​ నకులు కూడా ఉన్నారు.

కంధమాల్, రాయగఢ్, కళహండి ట్రైజంక్షన్‌లో పనిచేస్తున్న 15 మంది మావోయిస్టులకు సంబంధించి చిన్న సమూహం మినహా, ఈ బృందం లొంగిపోవడంతో బిజిఎన్ విభాగం దాదాపు అంతమైందని డీజీపీ తెలిపారు. మార్చి 31, 2026 నాటికి నక్సల్​ రహిత రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త పునరావాస పథకం కింద మద్దతు ఇస్తామని హామీనిచ్చారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈఘటనతో ఒడిశాaఓ నక్సలిజం అంతం దిశగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>