కలం, వెబ్ డెస్క్ : అమెరికా – ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం వంటింట్లో కాకరేపుతోంది. ఎల్పీజీ గ్యాస్ కొరత (LPG Gas Crisis) కారణంగా హోటల్స్, రెస్టారెంట్లు నడవలేని పరిస్థితికి చేరుకున్నాయి. మరీ ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చడంతో టిఫిన్ సెంటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే హోటల్స్, రెస్టారెంట్లలో మెనూ మార్పులు చేస్తూ ఐటమ్స్ కుదిస్తున్నాయి. ఈ క్రమంలోనే సూర్యాపేటలో కమర్షియల్ గ్యాస్ కొరత (LPG Gas Crisis) తీవ్ర ప్రభావం చూపుతోంది.
గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో మోటల్స్, రెస్టారెంట్లు పనిచేయకుండా నిలిచిపోయాయి. టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్ కూడా బంద్ అయ్యాయి. ఈ సమస్యలకు నిరసనగా హోటల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వాహకులు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాను వెంటనే సాధారణ స్థితికి తీసుకురావాలని, ప్రభుత్వం సహకరించాలని హోటల్ జేఏసీ డిమాండ్ చేస్తోంది.

