కలం వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో (Tirumalagiri) బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆర్మీ స్కూల్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. తిరుమలగిరిలో ఓ జవాన్ భార్య తన కొడుకును స్కూల్‌కు తీసుకెళ్లేందుకు బైక్ పై వెళ్తోంది. స్కూల్ దగ్గరకు రాగానే వీరి బైక్ అదుపు తప్పింది. తల్లీ కొడుకులు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. వీరి వెనకే వస్తున్న ఆర్మీ ట్రక్ (Army Truck) బాలుడిపైకి ఎక్కింది. దీంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తల్లి కళ్ల ముందే కొడుకు మరణించడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన బాలుడి తండ్రి శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
Tirumalagiri Tragedy: Lessons from a Heartbreaking Mishap and Vital Road Safety Tips to Save Lives#Tirumalagiri #RoadSafety #TrafficAwareness #SafetyFirst #DriveSafe #HyderabadTraffic #RoadSafetyTips #LifeMatters #Kalam #Kalamdaily #kalamtelugu pic.twitter.com/j2C9wxPnPc
— Kalam Daily (@kalamtelugu) January 21, 2026
Read Also: రాజమండ్రిలో యాక్సిడెంట్.. నల్లగొండలో ఉలిక్కిపాటు..!
Follow Us On: X(Twitter)


