కలం వెబ్ డెస్క్ : తిరుమల క్షేత్రం ఎంత ప్రసిద్ధి చెందిందో.. ఏడు కొండల స్వామి లడ్డూ ప్రసాదం కూడా అంతే ఫేమస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏటా కోట్లాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. కానుకల రూపంలో స్వామి వారికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. ఇక తిరుమల లడ్డూ(Tirumala Laddu) విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో జరుగుతాయి. ఈ ఏడాది లడ్డూ విక్రయాలపై టీటీడీ(TTD) కీలక ప్రకటన చేసింది. 2025లో మొత్తంగా 13.52 కోట్ల లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగినట్లు టీటీడీ తెలిపింది. గతేడాదితో పోల్చితే పది శాతం పెరిగినట్లు వెల్లడించింది. వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గత పది రోజుల నుంచి తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.
Read Also: న్యూ ఇయర్ వేళ తాడిపత్రిలో టెన్షన్!
Follow Us On : WhatsApp


