కలం వెబ్ డెస్క్ : అక్కినేని ఫ్యామిలీ(Akkineni Family) హీరోలు 2026లో క్రేజీ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఇయర్‌లో ముందుగా వచ్చే అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్(Akhil). కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బ్లాక్ బస్టర్ కోసం అఖిల్ వెయిట్ చేస్తునే ఉన్నాడు. కానీ.. రావడం లేదు. ఇప్పుడు లెనిన్(Lenin) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమాను మార్చిలో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈసారి మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
అఖిల్ లెనిన్ తర్వాత నాగచైతన్య సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. నాగచైతన్య(Naga Chaitanya) 24వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ వృషకర్మ(Vrushakarma). ఈ చిత్రాన్ని విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. థ్రిల్లర్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా వేరే లెవెల్లో ఉంటుందని.. అందుకనే కథపై నమ్మకంతో 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌లో వృషకర్మ థియేటర్స్ లోకి రానుంది.
ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా చేస్తున్నారు. దీనికి తమిళ దర్శకుడు కార్తీక్ డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల మైసూరులో షూటింగ్ చేశారు. తాజా షెడ్యూల్ కేరళలో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సీనియర్ నటీమణులు అనుష్క, టబు నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మే నెలలో రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఇలా 2026లో అక్కినేని హీరోలు క్రేజీ సినిమాలతో రాబోతున్నారు. మరి.. 2026లో ఈ మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి అక్కినేని నామ సంవత్సరంగా మార్చేస్తారేమో చూడాలి.

Read Also: నయన్ నోట ప్రమోషన్ మాట ..షాక్ అయిన అనిల్ రావిపూడి..!!
Follow Us On: Youtube


