కలం వెబ్ డెస్క్ : న్యూ ఇయర్ వేడుకలను ప్రజలంతా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. అయితే తాడిపత్రిలో (Tadipatri) మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) స్థానిక గాంధీ సర్కిల్‌లో నిరాహార దీక్ష చేయడం చర్చనీయాంశంగా మారింది. మ్యాటర్ ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడే ఆయనకు ఎవరైనా ఒక్కటే. అధికార పార్టీనా, ప్రతిపక్షమా అని తేడా లేకుండా తాను అనుకున్నది చేసి తీరుతారు. అయితే తన కుమారుడు అస్మిత్ రెడ్డి (Ashmit Reddy) ఎమ్మెల్యే ఉన్న తాడిపత్రి నియోజకవర్గంలోనే జేసీ మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్నారు.
ఇద్దరు తండ్రీకొడుకులే అధికారంలో ఉన్నా అనూహ్యంగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రజల్లో తనపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అస్సలు తాను ఎందుకు ఇలా ప్రవర్తించాల్సి వచ్చిందో వివరించేందుకే ఈ నిరాహార దీక్ష చేస్తున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకు తన ప్రవర్తన మార్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ఈ కొత్త సంవత్సరంలో తాడిపత్రి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
Read Also: తిరుమల లడ్డూ అమ్మకాల్లో సరికొత్త రికార్డు
Follow Us On: X(Twitter)


