కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి (Yadadri) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు (Kondamadugu Mettu) వద్ద ఆగివున్న టిప్పర్ ను వెనక నుండి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ప్రమాద దాటికి లారీ డ్రైవర్ కాలు తెగి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను రెండు గంటల పాటు శ్రమించి పోలీసులు బయటికి తీశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


