కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని సారపాక ఐటీసీలో దొంగలు పడడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరంతరం నిఘా ఉండే పటిష్టమైన భద్రత నడుమ చోరికి యత్నం జరిగింది. శుక్రవారం ఉదయం ఐటీసీ కర్మాగారంలో ముగ్గురు అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వారిని వెంబడించి చాకచక్యంగా పట్టుకున్నారు.
జిల్లా (Bhadradri Kothagudem) సారపాక ఐటీసీలోకి ఇతరులకు అనుమతి ఉండదు. లోపలికి వెళ్లాలంటే ఎవరైనా ఐడీ కార్డు చూపించాల్సి ఉంటుంది. సంస్థలో పని చేసేవారి సహకారంతో లోపలికి వెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. పట్టుబడిన వారిని సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. విచారణలో దొంగతనానికి పాల్పడిన వారు సారపాక గాంధీ నగర్ కు చెందిన చల్ల లక్ష్మణ్, చంటి, గణేష్ అని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు
Follow Us On: Sharechat


