Mobile Popup Ad
Mobile Popup Ad

ఉగాది పండుగ‌… ఆ ఊరిలో వింత ఆచారం!

క‌లం, వెబ్ డెస్క్‌: ఉగాది (Ugadi) పండుగ‌… తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రం.. ఉగాది ప‌చ్చ‌డి.. కొత్త పంచాంగ శ్ర‌వ‌ణం.. పూజా కార్య‌క్ర‌మాల‌తో అంద‌రూ సంతోషంగా జ‌రుపుకొనే వేడుక‌. కానీ, అంతటా ఉగాది అంటే ఇలాగే చేసుకుంటార‌ని అనుకోవ‌ద్దు. కొన్ని చోట్ల వింత వింత ఆచారాలూ ఉన్నాయ్‌.. క‌ర్నూలు (Kurnool) జిల్లాలోని ఓ ఊరిలో ఉగాదిని ప్ర‌తి ఏటా భిన్నంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. పండుగ పూల పిడ‌క‌ల‌తో యుద్ధ‌మే చేస్తున్నారు. ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఈ వేడుక‌లు జ‌రుగుతాయి. శ్రీ భద్రకాళి, వీరభద్రస్వామిల ప్రేమకు చిహ్నంగా ఈ వింత సంప్రదాయాన్ని కొన‌సాగిస్తున్నారు. పండుగ రోజు గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడకలు విసురుకుంటారు. కరి, పుల్ల అనే రెండు ఎద్దుల పేరు మీదుగా ఈ గ్రామానికి కైరుప్పల అనే పేరు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక్కడ మహావిష్ణు, పరమేశ్వరుడితో పాటు బ్రహ్మకు కూడా గుడి ఉండటం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>