కలం, మెదక్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నామినేషన్ రోజున మాజీ సీఎం కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో బిజెపి కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమం లో ఎంపీ రఘునందన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో రోజు రోజుకు బిజెపికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక.. మున్సిపల్ ఎన్నికల వేళ రెండు పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయని విమర్శించారు మెదక్ ఎంపీ. ‘సిట్ (SIT) నోటీసులు చూస్తే.. నువ్వు కొట్టినట్టు చేయూ, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. సిట్ తో ఏమి కాదని, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. అరెస్ట్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆయన (Raghunandan Rao) విమర్శించారు.
Read Also: ‘డబుల్’ ఇండ్లన్నీ హౌజింగ్ కార్పొరేషన్‌కే.. ప్రభుత్వ సర్క్యులర్ జారీ
Follow Us On : WhatsApp


